Identity: ‘ఐడెంటిటీ’ మూవీ తెలుగు ట్రైలర్
ABN, Publish Date - Jan 20 , 2025 | 11:24 PM
టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన - దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మించారు. మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన ఈ చిత్రం జనవరి 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన - దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మించిన చిత్రం ‘ఐడెంటిటీ’. టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషించగా.. వినయ్ రాయ్, మందిర బేడి ఇతర కీలక పాత్రలలో నటించారు. మలయాళంలో విడుదలైన రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025లో తొలి హిట్‌గా నిలిచిన ఈ సినిమాను మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ చిత్ర తెలుగు ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ చిత్రంలో తెలుగువారు కోరుకునే యాక్షన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుందని మామిడాల శ్రీనివాస్ చెబితే.. ఇది మలయాళ చిత్రం అయినప్పటికీ ఈ చిత్రంలో నటించిన వారు అలాగే ఈ సినిమాకు పనిచేసినవారు తెలుగునాట అందరికీ సుపరిచితులు కావడం విశేషమని, జనవరి 24న వస్తున్న ఈ చిత్రం అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని అన్నారు నిర్మాత చింతపల్లి రామారావు. ఇంకా ఈ కార్యక్రమంలో అఖిల్ పాల్, నటుడు వినయ్ రాయ్ వంటి వారు ప్రసంగించారు.