సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Roshans: మరో లెజండరీ డాక్యుమెంటరీ..

ABN, Publish Date - Jan 11 , 2025 | 09:28 AM

The Roshans: ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’, 'ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బీయాండ్‌’ పేరుతో తర్వాత బాలీవుడ్‌కి సంబంధించి స్టార్‌ హీరో కుటుంబంపై డాక్యుమెంటరీ సిద్థమైంది.

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్‌ రోషన్‌ ఆయన తండ్రి రాకేశ్‌ రోషన్‌(Rakesh Roshan), తాతయ్య రోషన్‌ కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌ గురించి ఇందులో చూపించనున్నారు. 'ది రోషన్స్' పేరుతో డాక్యుమెంటరీ తెరకెక్కనుంది. 2000 సంవత్సరంలో హృతిక్‌ పరిశ్రమలో అడుగుపెట్టారు. తన తండ్రి రాకేశ్‌ రోషన్‌ దర్శకత్వంలో 'కహో నా ప్యార్‌’ హైతో తెరంగేట్రం చేసి విజయాన్ని అందుకున్నారు. ఆ ఏడాది ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా అది నిలిచింది. ఉత్తమ నటుడిగా పురస్కారాలు అందుకున్నారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ డాక్యుమెంటరీ జనవరి 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Updated Date - Jan 11 , 2025 | 09:34 AM