Retro: సూర్య ‘రెట్రో’ తెలుగు టీజర్
ABN, Publish Date - Feb 08 , 2025 | 06:31 PM
సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘రెట్రో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర తెలుగు టీజర్‌ని శనివారం మేకర్స్ విడుదల చేశారు.
వెర్సటైల్ స్టార్ సూర్య హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం Suriya44, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఇటీవలే ‘రెట్రో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సూర్య, సుబ్బరాజ్‌ల ఫస్ట్ కొలాబరేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. టైటిల్ టీజర్ రెట్రో వరల్డ్‌కి గ్లింప్స్‌ని ప్రజెంట్ చేస్తోంది, ఇది ఇంటెన్స్ యాక్షన్, రొమాన్స్, ఎమోషనల్ డెప్త్‌ను బ్లెండ్ చేసిన గ్యాంగ్‌స్టర్ డ్రామా. టీజర్ సూర్య పాత్రపై కేంద్రీకృతమై ఉంది, పూజా హెగ్డే పాత్రపై అతని ప్రేమ, హింసాత్మక ప్రపంచం నుండి బయటికి వెళ్ళడానికి అతని సంఘర్షణని ప్రజెంట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.