Kanguva: ‘కంగువ’ మూవీ ‘నాయక’ వీడియో సాంగ్

ABN, Publish Date - Jan 29 , 2025 | 10:15 AM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ.. విజువల్‌గా మాత్రం మంచి ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను రాబట్టుకుంటోన్న ఈ చిత్రంలోని ‘నాయక’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. రెండు డిఫరెంట్ రోల్స్‌లో సూర్య నటన, హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్, లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకున్న బలం. ‘కంగువ’లో ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇచ్చింది చిత్ర టీమ్. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుండి ‘నాయక’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- Fatima Sana Shaikh: ఓ తెలుగు నిర్మాత పచ్చిగా అడిగాడు.. ‘దంగల్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్


Also Read- Wife Off Movie Review: బావని చిన్నప్పుడే భర్తగా ఊహించుకున్న మరదలు వేశ్యగా ఎందుకు మారింది?

Also Read- Mega Star Chiranjeevi: ఫస్ట్ షూటింగ్ నాదే..

Also Read- Balakrishna: 'హిట్ 4'లో హీరోగా బాలయ్య?

Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jan 29 , 2025 | 10:15 AM