Jailer 2: నాలుగు నిమిషాల వీడియోతో ‘జైలర్ 2’ అనౌన్స్‌మెంట్.. వీడియో అదిరింది
ABN, Publish Date - Jan 14 , 2025 | 09:26 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన మరోసారి ‘జైలర్’ దర్శకుడికి అవకాశం ఇచ్చారు. ‘జైలర్’కి సీక్వెల్‌గా రానున్న ఈ సినిమాకు నెల్సన్ అద్భుతమైన కథను రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. పొంగల్‌ని పురస్కరించుకుని ‘జైలర్ 2’ మూవీ అనౌన్స్‌మెంట్ టీజర్‌ని వదిలారు. ఈ టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.
తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ప్రొమోషన్స్ ఎలా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడాయననే ఫాలో అవుతున్నాడు తమిళ దర్శకుడు నెల్సన్. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘జైలర్’ సినిమా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నెల్సన్.. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి ఈ సీక్వెల్‌పై కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఉండదనే అంతా అనుకున్నారు. కానీ పొంగల్‌ని పురస్కరించుకుని.. ‘జైలర్ 2’ అనౌన్స్‌మెంట్ టీజర్‌తో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
Also Read-Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే
ఈ టీజర్‌లో ఉన్న విశేషం ఏమిటంటే.. ఇందులో దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా నటించారు. ఓ యాక్షన్ బ్లాక్‌తో టీజర్‌ని కట్ చేశారు. ‘జైలర్’లో ఎలా అయితే రజనీకాంత్ కనిపించారో.. ఇందులోనూ సేమ్ టు సేమ్ కనిపించి నెల్సన్, అనిరుధ్‌లను భయపెట్టేశారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సీక్వెల్‌ని కూడా నిర్మిస్తోంది. ఇక ఈ టీజర్‌కి అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్ అంతే. మరెందుకు ఆలస్యం ‘జైలర్ 2’ అనౌన్స్ మెంట్ వీడియో చూసేయండి.
Also Read: Hari Hara Veeramallu: పవన్ 'మాట వినాలి' లేకపోతే ఏమవుతుందో తెలుసా..
Also Read: Daaku Maharaaj Review: బాలయ్య నటించిన మాస్ మసాలా మూవీ ‘డాకు మహారాజ్’ ఎలా ఉందంటే
Also Read:Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jan 14 , 2025 | 09:26 PM