JAAT Trailer : ఈ లంకలోకి అడుగు పెట్టాలంటే దేవుడు కూడా..
ABN, Publish Date - Mar 24 , 2025 | 02:34 PM
సన్నీదేవోల్ (Sunny Deol), గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘జాట్’ (JAAT). సయామీ ఖేర్, రెజీనా కథానాయికలు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈసినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా హిందీ ట్రైలర్‌ను విడుదల చేసారు. పవర్‌ఫుల్ డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలతో ఈ ట్రైలర్ సాగింది. ‘ఈ లంకలోకి అడుగుపెట్టేందుకు భగవంతుడు కూడా భయపడతాడు’ అంటూ ప్రతి నాయకుడి ప్రాంతం గురించి రెజీనా చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి ‘నిన్ను, నీ లంకను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’, ‘ఈ చేతికి ఉన్న పవరేంటో మొత్తం ఉత్తరాది చూసింది. ఇప్పుడు దక్షిణాది చూడనుంది’ అంటూ సన్నీదేవోల్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
Updated at - Mar 24 , 2025 | 02:34 PM