Gandhi Tatha Chettu: సుకుమార్ కూతురు పెద్ద ధగడ్.. ఎందుకో తెలుసా
ABN, Publish Date - Jan 19 , 2025 | 09:29 PM
Gandhi Tatha Chettu: ఒకవైపు గాంధీవాదం అంటూనే సుకుమార్ కుమార్తె నేను పెద్ద ధగడ్ అంటుంది. మ్యూజిషియన్ రీ తోడుతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆమెకు బలమైన స్వరాన్ని అందించారు. మరి ఈ ధగడ్ లొల్లి ఏందో మీరు చూసేయండి.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో పద్మావతి మల్లాది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గాంధీ తాత చెట్టు'. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాని జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.