Daaku Maharaaj Song: ‘డాకు మహారాజ్’ సుక్క నీరే లిరికల్ సాంగ్
ABN, Publish Date - Jan 24 , 2025 | 09:51 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఫిల్మ్ ‘డాకు మహారాజ్’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. జనవరి 12న సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని థియేటర్లలో దూసుకెళుతోంది. ఈ చిత్ర సక్సెస్‌ని పురస్కరించుకుని తాజాగా మేకర్స్ సినిమాలోని ‘సుక్క నీరే’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’గా వచ్చి మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సంచలన వసూళ్లును సాధిస్తోంది. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ సక్సెస్‌ని పురస్కరించుకుని తాజాగా మేకర్స్ ఇందులోని ‘సుక్క నీరే’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు టాప్‌లో ట్రెండ్ అవుతోంది.