#Single Glimpse: వాలెంటైన్స్ వీక్‌లో సింగిల్స్‌కు కావాల్సిన కిక్కిచ్చిన శ్రీ విష్ణు
ABN, Publish Date - Feb 10 , 2025 | 05:44 PM
నటుడు శ్రీ విష్ణు ఈ మధ్యకాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సినిమా ప్రేక్షకులను అస్సలు డిసప్పాయింట్ చేయడం లేదు. ప్రస్తుతం వాలెంటైన్ వీక్‌లో సింగిల్స్ కోసం అద్భుతమైన గ్లిమ్ప్స్ తో ముందుకు వచ్చాడు.
శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో కార్తిక్‌రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘#సింగిల్’. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్‌తో పాటు విద్య కొప్పినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యూత్‌ఫుల్‌ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
Updated at - Feb 10 , 2025 | 05:50 PM