LYF Teaser: ‘ఎల్.వై.ఎఫ్’ మూవీ టీజర్
ABN, Publish Date - Jan 25 , 2025 | 03:35 PM
ఎస్.పి చరణ్ కీలక పాత్రలో, శ్రీహర్ష, కషిక కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎల్ వై ఎఫ్’ (లవ్ యువర్ ఫాదర్). తండ్రి కొడుకుల ప్రేమను తెలియజేసే చిత్రంగా పవన్ కేతరాజు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
శ్రీహర్ష, కషిక కపూర్ హీరోహీరోయిన్లుగా.. ఎస్.పి చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఎల్ వై ఎఫ్’ (లవ్ యువర్ ఫాదర్). మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ రాటి, మహేష్ రాటి, ఏ రామస్వామి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పవన్ కేతరాజు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ప్రవీణ్, భద్రం, నవాబ్ షా, షకలక శంకర్, రవిబాబు, రియా, సంధ్య తదితరులు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read- Akhanda 2 Thandavam Heroine: ప్రగ్యా జైస్వాల్ ఏమైంది.. ఇదేం ట్విస్ట్ బోయపాటి?
టీజర్ విడుదల అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మంచి కథతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలి. నిర్మాతలు తీసే సినిమాలు ఎక్కువ బడ్జెట్లో కాకుండా మంచి కంటెంట్‌తో తక్కువ బడ్జెట్‌లో తీస్తే బాగుంటుంది. ఎక్కువ బడ్జెట్ పెట్టి తర్వాత టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం కంటే తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మంచిది. ఈ ‘ఎల్ వై ఎఫ్’ అనే చిత్రం అలా తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమని నేను అనుకుంటున్నాను. ఇటువంటి చిత్రాలను ప్రోత్సహించడంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా నేనెప్పుడూ ముందుంటాను. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అని చెప్పారు.