Sivakarthikeyan: శ్రీలీలతో కలిసి పరాశక్తిగా మారిన శివ కార్తికేయన్
ABN, Publish Date - Jan 29 , 2025 | 06:51 PM
Sivakarthikeyan: అద్భుతమైన చిత్రాలతో సౌతిండియాలోనే రైజింగ్ స్టార్‌గా మంచి పేరు సంపాదించుకున్న హీరో శివ కార్తికేయన్. ప్రస్తుతం పరాశక్తి అవతారమెత్తి బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి సిద్దమయ్యాడు.
ఇటీవల కాలంలో తెలుగు సినీ ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన తమిళ నటుడు శివకార్తికేయన్. ఆయన టాలెంటెడ్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో శ్రీలీలతో జంటగా వస్తున్న చిత్రం 'పరాశక్తి'. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు. పీరియాడికల్ డ్రామాగా కనిపిస్తున్న ట్రైలర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉంది. శివకార్తికేయన్, శ్రీలీలతో పాటు రవి మోహన్, అథర్వ ప్రధాన పాత్రలు పోషించారు.
Updated at - Jan 29 , 2025 | 06:53 PM