Jack Teaser: సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ టీజర్
ABN, Publish Date - Feb 07 , 2025 | 06:51 PM
డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. శుక్రవారం సిద్ధు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ వదిలారు.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘జాక్- కొంచెం క్రాక్’. ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఫిబ్రవరి 7 సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రయూనిట్ చిత్ర టీజర్‌ని విడుదల చేసింది. సిద్ధు, భాస్కర్ కాంబోలో అదిరిపోయే ఓ వినోదాత్మక చిత్రం రాబోతుందనే హింట్‌ని అయితే ఈ టీజర్ ఇచ్చేస్తుంది. (Jack Konchem Crack)