3BHK Movie: ‘3BHK’ ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్

ABN, Publish Date - Feb 06 , 2025 | 05:49 PM

సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ, శాంతి టాకీస్ మూవీ టైటిల్ ‘3 BHK’. ఈ మూవీకి సంబంధించి బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేశారు. 2025 సమ్మర్‌లో ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.

సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 3BHK అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని బ్యూటీఫుల్ ఫ్యామిలీగా కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.

Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..

‘ఇది మన ఇంటి కథ.. ఈ ఇంట్లోనే చిన్న చిన్నగా చాలా కథలు వున్నాయి. ఇది మసాల డబ్బా కాదు.. అమ్మ గారి చిన్న బ్యాంక్. ఇది నాన్న గారి సెంటిమెంటు బీరువా’ అంటూ సిద్ధార్థ్ వాయిస్‌తో మొదలైన టైటిల్ టీజర్ ఫీల్ గుడ్ మూమెంట్స్‌తో క్యురియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రానికి అమృత్ రామ్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. దినేష్ కృష్ణన్ బి, జితిన్ స్టానిస్లాస్ డీవోపీగా పని చేస్తున్నారు. గణేష్ శివ ఎడిటర్. రాకేందు మౌళి డైలాగ్ రైటర్. 2025 సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.


Also Read- Madhavan: కొంపముంచిన ఏఐ.. మాధవన్‌కు అనుష్క కాల్

Also Read- Sairam Shankar: ‘పట్టుకుంటే 10 వేలు’ పథకం పెట్టడానికి కారణం ఏంటంటే..

Also Read- Balakrishna Favourite Heroines: బాలయ్య ఫేవరెట్ హీరోయిన్లు ఎవరో తెలుసా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Feb 06 , 2025 | 05:49 PM