Sankranthiki Vasthunam Trailer: పెద్దోడి కోసం చిన్నోడు.. 'సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్'

ABN, Publish Date - Jan 06 , 2025 | 08:24 PM

వెంకటేష్, మహేష్ ఈ ఇద్దరి బంధం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో స్పెషల్. అందుకే పెద్దోడి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ ని చిన్నోడు రిలీజ్ చేశాడు.

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్.. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా ట్రైలర్ రిలీజ్ చేయించారు. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. భీమ్స్ సంగీతం అందించారు.

Updated at - Jan 06 , 2025 | 08:24 PM