Subham Teaser: సమంత ‘శుభం’.. శోభనం గదిలో ఏమైంది..
ABN, Publish Date - Mar 31 , 2025 | 04:52 PM
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పతాకం నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. 'సినిమాబండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. హర్షిత్ రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ లీడ్ రోల్స్ చేశారు. ఉగాది సందర్భంగా టీజర్ విడుదల చేశారు. కొత్త పెళ్లి కొడుకు (హర్షిత్ రెడ్డి), పెళ్లి కూతురు శ్రీవల్లి (శ్రీయా) శోభనం గదిలో మాట్లాడుకుంటూ ఒక్కసారిగా అతడు బెదిరిపోతాడు. ఇలా ఆసక్తికరంగా సాగింది టీజర్.