సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Subham: ఆసక్తికరంగా సమంత 'శుభం' ట్రైలర్

ABN, Publish Date - Apr 27 , 2025 | 12:50 PM

హీరోయిన్  సమంత నిర్మాతగా వ్యవహరించిన మొదటి  చిత్రం ‘శుభం’ (Subham Trailer). సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్‌ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ‘శుభం’ ట్రైలర్‌ను సమంత షేర్‌ చేసింది. ముగ్గురు స్నేహితుల జీవిత కథగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. వాళ్ల భార్యలు సీరియల్‌కు అలవాటు పడటం.. ఆ తర్వాత దెయ్యాలు పట్టడం వంటి సన్నివేశాలతో సిద్ధమైన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది.  

Updated Date - Apr 27 , 2025 | 12:50 PM