సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Return of The Dragon Trailer: ప్రదీప్‌ రంగనాథన్‌ చెప్పిన ఒక ఫెయిల్యూర్ కథ..

ABN, Publish Date - Feb 10 , 2025 | 08:41 PM

'లవ్ టుడే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన కోలీవుడ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్. తాజాగా మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ యూత్‌కు ఎంతో రిలేటబుల్‌గా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో 'ఓరి దేవుడా' సినిమా తెరకెక్కించిన అశ్వత్‌ మారిముత్తు.. ప్రదీప్‌ రంగనాథన్‌ తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రిటర్న్‌ ఆఫ్‌ డ్రాగన్‌’. ఈ సినిమాలో హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ ఫిబ్రవరి 21న తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. కాగా, ఈ సినిమాని తమిళ్‌లో 'డ్రాగన్' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడిపుడే తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.

Updated Date - Feb 10 , 2025 | 08:44 PM