Brahma Anandam: ‘బ్రహ్మా ఆనందం’ మూవీ రెచ్చిపోవాలే లిరికల్ సాంగ్
ABN, Publish Date - Feb 02 , 2025 | 09:29 PM
చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. అందరికీ ఎమోషనల్ టచ్ ఇచ్చాయి. ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం నుండి తాజాగా ‘రెచ్చిపోవాలే’ అనే మాస్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.
‘మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి హిట్ చిత్రాలతో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకుల్లో మంచి మార్కులు సంపాదించుకుంది. హ్యాట్రిక్ హిట్ల తర్వాత ప్రస్తుతం ఓ సున్నితమైన అంశంతో ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రంతో అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు వస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌కి ఇది నాలుగో ప్రాజెక్ట్. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.
Also Read- Thandel: సంధ్య థియేటర్ ఎఫెక్ట్.. ‘తండేల్’ వేడుకకు నో ఎంట్రీ బోర్డ్..
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రాబట్టుకోగా.. తాజాగా ఈ మూవీ నుండి ఓ మాస్ నెంబర్‌ని మేకర్స్ వదిలారు. ‘రెచ్చిపోవాలే’ అంటూ వచ్చిన ఈ పాటలో గ్రామాల్లో జాతర అంటే ఎలా ఉంటుందో.. ఆ సందడి ఎలా ఉంటుందో చూపించబోతోన్నారు. శాండిల్య పిసాపాటి బాణీ, శ్రీ సాయి కిరణ్ సాహిత్యం, సింగర్ సాకేత్-శాండిల్య గాత్రం ఈ పాటకు అదనపు ఆకర్షణ. ఇక ఈ పాటలో రాజా గౌతమ్ ఎనర్జిటిక్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
Also Read- Janhvi Kapoor: జాన్వీ కపూర్ కండోమ్ యాడ్‌కు పర్ఫెక్ట్.. కండోమ్ సంస్థ అధినేత
Also Read- Kollywood Directors: కోలీవుడ్ డైరెక్టర్లు.. భయపడుతున్న టాలీవుడ్ హీరోలు!
Also Read- Raghava Lawrence Kanchana 4: ‘కాంచన 4’.. కత్తిలాంటి ఫిగర్‌ని పట్టిన లారెన్స్
Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Feb 02 , 2025 | 09:29 PM