Rana Naidu Season 2: రానా వర్సెస్ వెంకీ పార్టు-2
ABN, Publish Date - Feb 03 , 2025 | 05:41 PM
Rana Naidu Season 2: హ్యాపీగా సంక్రాంతి ముగియడంతో.. రానాతో కలిసి వైలెన్స్ షురూ చేశాడు విక్టరీ వెంకటేష్. దీనికి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మరోసారి వేదిక కానుంది.
రానా(Rana), వెంకటేశ్(Venkatesh) కీలక పాత్రలు పోషించిన ‘రానా నాయుడు’ (Rana naidu)వెబ్‌సిరీస్ ఓటీటీలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే! తాజాగా దీనికి సీక్వెల్ గా మరెన్నో ట్విస్టులు, ఫ్యామిలీ డ్రామాతో ‘రానా నాయుడు-2’ టీజర్ విడుదల చేశారు. ఈ సారి బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇందులో కనిపించనుండటం గమనార్హం.