‘రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ట్రైలర్
ABN, Publish Date - Jan 11 , 2025 | 06:47 PM
భారత దేశంలో రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకీ రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చినా, ఇప్పుడు ప్రత్యేకంగా ‘రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ టైటిల్‌తో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
‘రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్’ సినిమా ట్రైలర్ భారీ అంచనాల నడుమ శనివారం విడుదల చేశారు. భారత దేశంలో రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకీ రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చినా, ఇది ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైలర్‌లో విజువల్స్ చాలా బాగున్నాయి. యుద్ధ సన్నివేశాలు చూస్తే, ఆ రోజుల్లో అయోధ్యలో జరిగిన ఘట్టాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఈ ట్రైలర్‌లో చూపించిన అయోధ్య, మిథిలా నగరాలూ, పంచవటి అడవి ప్రాంతం, సీతారాములు అరణ్యవాసం చేసిన ప్రదేశాలు మొదలగునవి అన్నీ సహజంగా అనిపిస్తున్నాయి. యుగో సాకో, కోయిచి ససకి మరియు రామ్ మోహన్‌లు అందరూ కలిసి ఈ సినిమా ని మన ముందుకు తీసుకొస్తున్నారు. దాదాపుగా 450 ఆర్టిస్ట్స్, ఒక లక్ష మంది హ్యాండ్ డ్రాన్ సేల్స్ ద్వారా ఈ విజువల్ మాస్టర్ పీస్ ని రూపొందించారు.