Ram Charan: 'గేమ్ ఛేంజర్' నుండి ఫుల్ సాంగ్ వచ్చేసింది.. విజువల్ ఫీస్ట్

ABN, Publish Date - Jan 27 , 2025 | 07:37 PM

Ram Charan: ఈ సంక్రాంతికి రిలీజైన శంకర్, రామ్ చరణ్ ల చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా అభిమానులను తీవ్ర నిరాశపరచగా పాటలు మాత్రం పర్వాలేదనిపించాయి. ప్రధానంగా పాటల్లో కనిపించిన విజువల్స్ మరోసారి శంకర్ మార్క్ ని క్రిస్టల్ క్లియర్ గా చూపించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నుండి 'జరగండి జరగండి' ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఈ పాటను దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ ఆలపించగా అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించాడు. థమన్ సంగీతం ఉర్రూతలూగిస్తుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. ‘‘గేమ్‌ ఛేంజర్‌’ అవుట్‌పుట్‌తో నేను సంతృప్తిగా లేను. నేను అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలి. సమయాభావం వల్ల కొన్ని సీన్స్‌ కట్‌ చేయాల్సి వచ్చింది. దీంతో కథ అనుకున్న విధంగా రాలేదు’’ అంటూ చెప్పుకొచ్చారు.

Updated at - Jan 27 , 2025 | 07:39 PM