Hari Hara Veeramallu: పవన్ 'మాట వినాలి' లేకపోతే ఏమవుతుందో తెలుసా..
ABN, Publish Date - Jan 14 , 2025 | 01:09 PM
Hari Hara Veeramallu: ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో పవన్ మాటకి బాగా పలుకుబడి వచ్చింది. మరి సినిమాలో కూడా తన 'మాట వినాలి' అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకో ఓ లుక్కేయండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తోన్న ఎపిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. 'మాట వినాలి వీర మల్లు మాట వినాలి' అంటూ సాగే పాటను పవన్ ఆలపించాడు. ఫుల్ సాంగ్ జనవరి 17న రిలీజ్ కానుంది. ఈ పాటకి పెంచల్ దాస్ లిరిక్స్ అందించడం విశేషం. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి సంగీతం అందించారు.
Updated at - Jan 14 , 2025 | 01:09 PM