Jack First Single: ‘జాక్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
ABN, Publish Date - Mar 07 , 2025 | 05:44 PM
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘పాబ్లో నెరుడా’ అంటూ హుషారుగా సాగే ఈ ఫస్ట్ సింగిల్‌ను వనమాలి రచించారు. అచ్చు రాజమణి బాణీ ఎంతో క్యాచీగా ఉంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అట్రాక్షన్‌గా నిలిచింది. బెన్నీ దయాల్ వాయిస్ అద్భుతంగా కుదిరింది. సిద్ధు జొన్నలగడ్డకు జోడిగా ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Updated at - Mar 07 , 2025 | 05:46 PM