Laila Movie Song: ‘ఓహో రత్తమ్మ’ సాంగ్ ప్రోమో
ABN, Publish Date - Jan 31 , 2025 | 12:57 PM
‘లైలా’ మూవీ ఫస్ట్ సింగిల్ ‘సోనూ మోడల్’ వీడియో సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. సెకండ్ సింగిల్ ‘ఇచ్చుకుందాం బేబీ’ ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు మూడో సింగిల్‌కు సంబంధించిన అప్డేట్‌తో.. మేకర్స్ చిన్న ప్రోమోని కూడా వదిలారు. ‘ఓహో రత్తమ్మ’ అంటూ సాగే ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లైలా’. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్‌గా రిలీజైన టీజర్, ‘సోనూ మోడల్’ ఫస్ట్ సింగిల్, ‘ఇచ్చుకుందాం బేబి’ సెకండ్ సింగిల్ సెన్సేషన్‌ని క్రియేట్ చేసి సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం ఈ థర్డ్ సింగిల్‌కు సంబంధించిన ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ‘ఓహో రత్తమ్మ’ అంటూ సాగే ఈ పాటను పెంచల్ దాస్ పాడుతున్నారు. విశ్వక్సేన్ అమ్మాయి- అబ్బాయిగా కనిపించనున్న ఈ మూవీ.. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ మూవీ విడుదలకాబోతోంది.