Laila Movie: ‘ఓహో రత్తమ్మ’ లిరికల్ సాంగ్
ABN, Publish Date - Feb 01 , 2025 | 10:20 PM
మాస్ కా దాస్ విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ‘లైలా’ మూవీ నుండి ‘ఓహో రత్తమ్మ’ సాంగ్ వచ్చేసింది. ‘లైలా’ సినిమా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్‌లో విడుదల కానుంది.
మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘లైలా’. విశ్వక్సేన్ సోను మోడల్, లైలాగా రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించడం చాలా క్యురియాసిటీ పెంచింది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. టీజర్, మొదటి రెండు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా, తాజాగా థర్డ్ సింగిల్ ‘ఓహో రత్తమ్మ’ను మేకర్స్ వదిలారు. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ‘ఓహో రత్తమ్మ’ అందరినీ అలరించే మాస్ ఫీస్ట్ అందిస్తుంది. పెంచల్ దాస్, మధుప్రియ ఈ పాటను ఆలపించగా.. పాట పాడిన పెంచల్ దాస్ రూరల్, మాస్ సాహిత్యాన్ని ఈ పాటకు అందించారు. సోషల్ మీడియా సెన్సేషనల్ ట్రాక్ ‘కోయారే కోయ్ కోయ్’ చేర్చడం పాటకు ఎక్స్ట్రా ఎంటర్ టైన్మెంట్‌ని యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.