Tribanadhari Barbarik: ‘త్రిబాణధారి బార్భరిక్’లోని సిద్ శ్రీరామ్ పాడిన నీవల్లే సాంగ్
ABN, Publish Date - Feb 08 , 2025 | 09:03 PM
‘త్రిబాణధారి బార్భరిక్’.. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ పెంచగా.. తాజాగా నీవల్లే అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంఫ్యూజన్ బ్యాండ్ మ్యూజిక్‌లో స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘త్రిబాణధారి బార్భరిక్’.. టైటిల్‌తోనే అందరిని ఆకర్షిచించిన చిత్రం. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ వంటివారు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ‘నీవల్లే నీవల్లే’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.