Daaku Maharaaj: మరోసారి 'దబిడి దిబిడే' అంటున్నా బాలయ్య
ABN, Publish Date - Jan 02 , 2025 | 05:36 PM
తాజాగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ చిత్రం ‘డాకు మహారాజ్’ నుండి అదిరిపోయే సాంగ్ ని రిలీజ్ చేశారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ చిత్రం ‘డాకు మహారాజ్’. దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ 'దబిడి దిబిడే' అనే స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అదరగొట్టగా.. వాగ్దేవి, తమన్ వోకల్స్ హైలెట్‌గా నిలిచాయి.
Updated at - Jan 02 , 2025 | 05:36 PM