Test Trailer: నయనతార ‘టెస్ట్’ ట్రైలర్ చూసేయండి
ABN, Publish Date - Mar 25 , 2025 | 08:13 PM
మాధవన్, నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ కీలక పాత్రల్లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఎస్.శశికాంత్ దర్శకుడు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మంగళవారం ట్రైలర్ విడుదలైంది. చెన్నైలో జరిగిన ఒక అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
Updated at - Mar 25 , 2025 | 08:13 PM