Nani: ‘ది ప్యారడైజ్‌’.. ‘రా స్టేట్‌మెంట్‌’

ABN, Publish Date - Mar 04 , 2025 | 12:46 PM

హీరో నానిన్ ‘దసరా’లో ఊరమాస్‌ అవతారంలో చూపించి ప్రేక్షకుల్ని మెప్పించారు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల. ఇప్పుడాయన ‘ది ప్యారడైజ్‌’తో (The Paradise) నానిని మరో కొత్త అవతారంలో తెరపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ‘దసరా’  తర్వాత వీళ్లిద్దరి కలయికలో రూపొందుతున్న సినిమా  సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.  ‘రా స్టేట్‌మెంట్‌’ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. ఈ టైటిల్‌కు తగ్గట్లుగానే ప్రచార చిత్రంలో వినిపించిన సంభాషణలు.. నాని లుక్కు.. గెటప్పు.. అన్నీ ఊరనాటుగా ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్‌ లాంటి విదేశీ భాషల్లోనూ వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది.  

Updated at - Mar 04 , 2025 | 12:46 PM