Namo Namah Shivaya Song Promo: 'తండేల్' నుండి పవర్ ఫుల్ సాంగ్
ABN, Publish Date - Jan 03 , 2025 | 10:06 PM
నాగ చైతన్య తండేల్ మూవీ నుండి పవర్ ఫుల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని జనవరి 4న రిలీజ్ చేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్‌గా నిలిచింది.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా 'తండేల్'. తాజాగా ఈ సినిమా నుండి నమో నమః శివాయ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల స్ఫూర్తితో రూపొందింది. ఈ మూవీకి షామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. ఆర్ట్ విభాగానికి శ్రీనాగేంద్ర తంగాల నేతృత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదల కానుంది.
Updated at - Jan 03 , 2025 | 10:06 PM