Thandel: తండేల్ నుంచి శివుడి పాట వచ్చేసింది
ABN, Publish Date - Feb 27 , 2025 | 05:03 PM
మహా శివరాత్రిని పురస్కరించుకుని ‘తండేల్’ (Thandel) చిత్ర బృందం సినీ ప్రియులకు భలే గిఫ్ట్ ఇచ్చింది. ఆ సినిమాలోని శివుడి పాట ‘నమో నమః శివాయ’ (Namo Namah Shivaya) ఎంతగా పాపులర్ అయిందో తెల్సిందే. తాజాగా ఫుల్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. హీరోహీరోయిన్లు నాగ చైతన్య (Naga Chaitanya)- సాయి పల్లవి (Sai Pallavi) డ్యాన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, హరిప్రియ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమాకూర్చారు. ఉత్తరాంధ్రలో మత్స్యకారుల జీవితాల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై హిట్ అయినా సంగతి తెల్సిందే.