Thandel Song: ‘తండేల్’ మూవీ హైలెస్సో హైలెస్సా లిరికల్ సాంగ్
ABN, Publish Date - Jan 23 , 2025 | 09:53 PM
చైతూ, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ‘తండేల్’ మూవీ నుండి మూడో సాంగ్ వచ్చేసింది. ఇంతకు ముందు వచ్చిన ‘బుజ్జి తల్లి, నమో నమః శివాయ’ పాటలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో.. ఇప్పుడొచ్చిన ‘హైలెస్సో హైలెస్సా’ సాంగ్ కూడా అదే తరహాలో ఆదరణను రాబట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
యువ సామ్రాట్ నాగ చైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మొదటి రెండు పాటలు ‘బుజ్జి తల్లి, నమో నమః శివాయ’ మంచి స్పందనను రాబట్టుకోగా.. గురువారం మేకర్స్ మూడో సాంగ్.. ‘హైలెస్సో హైలెస్సా’ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హైలెస్సో హైలెస్సా సాంగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ షిప్‌ని, ఎదురుచూపులని, నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న అనురాగాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. వండర్ ఫుల్ మోలోడీస్‌ని కంపోజ్ చేయడంలో మాస్టర్ అయిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. మరోసారి మంచి లవ్ మెలోడీని కంపోజ్ చేశారు. శ్రేయ ఘోషల్, నకాష్ అజీజ్ ఈ పాటను ఆలపించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.