Mass Jathara: మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ గ్లింప్స్
ABN, Publish Date - Jan 26 , 2025 | 01:07 PM
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా భాను భోగవరపు దర్శకత్వంలో.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రచార చిత్రాలు మంచి స్పందనను రాబట్టుకోగా.. రవితేజ పుట్టినరోజును పురస్కరించుకుని ఆదివారం మేకర్స్ ‘మాస్ జాతర’ గ్లింప్స్ వదిలారు.

మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు (జనవరి 26) సందర్భంగా ‘మాస్ జాతర’ మూవీ నుండి అభిమానులకు స్పెషల్ ట్రీట్ వచ్చింది. మాస్ ర్యాంపేజ్ అనేలా అభిమానులకు గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. భాను భోగవరపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం మునుపటి రవితేజను మళ్లీ ప్రేక్షకులకు పరిచయం చేస్తుందనేలా ఈ గ్లింప్స్ క్లారిటీ ఇచ్చేస్తోంది. ఈ గ్లింప్స్‌లో ‘మనదే ఇదంతా’ అనే డైలాగ్స్ మాస్ రాజా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇస్తోంది. ఎందుకంటే, ఇది రవితేజ కెరీర్‌లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించకుంది. మొత్తంగా అయితే ఈ గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.