Kannappa: ఒక్క పాటతోనే ‘కన్నప్ప’పై హైప్ పెంచారు..

ABN, Publish Date - Feb 10 , 2025 | 07:24 PM

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' (Kannappa) ఏప్రిల్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ షురూ అయ్యాయి. తాజాగా సినిమా నుండి రిలీజ్ చేసిన 'శివ శివ శంకర' అనే సాంగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ తో పాటు స్టీఫెన్ దేవస్సీ సంగీతం, విజువల్స్ వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో అభిమానులు ఈ పాట సినిమాపై ఆశలు రేకెత్తిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

అవా ఎంటర్టైన్మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు, శరత్‌కుమార్‌, మధుబాల, ముఖేష్‌రిషి, బ్రహ్మానందం బ్రహ్మాజీ, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, కాజల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 25 గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్నాయి.

Updated at - Feb 10 , 2025 | 07:27 PM