Fateh: మహేష్ బాబు రిలీజ్ చేసిన 'ఫతే' ట్రైలర్

ABN, Publish Date - Jan 06 , 2025 | 06:12 PM

Fateh: కరోనా కష్ట సమయంలో దేశ ప్రజలకు అండగా నిలిచి రీయల్ హీరో అనిపించుకున్న నటుడు సోను సూద్. ఈ సంక్రాంతికి ఆయన 'ఫతే' వైలెంట్ యాక్షన్ సినిమాతో తేరా ముందుకు రానున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

సోను సూద్ స్వీయ దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో సోనూసూద్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) జంటగా శాంతి సాగర్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఫతే’ (Fateh). ఈ సినిమా జనవరి 10న హిందీలో రిలీజ్ కావడానికి సిద్ధమైంది. ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేశారు. నసీరుద్దీన్ షా, విజయ్ రాజ్ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించారు.

Updated at - Jan 06 , 2025 | 06:15 PM