Madha Gaja Raja: ‘మదగజరాజ’ మూవీ చిక్కు బుక్కు లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jan 26 , 2025 | 07:12 PM

విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘మదగజరాజ’. ఈ చిత్రం చాలా గ్యాప్ తర్వాత ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చి, సెన్సేషనల్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. సుందర్. సి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని ‘చిక్కు బుక్కు’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

హీరో విశాల్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ ‘మదగజరాజ’. సుందర్.సి దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. కోలీవుడ్‌లో రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి, సంక్రాంతికి విడుదలైన తమిళ సినిమాలన్నింటిలో నంబర్ వన్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటికీ భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకెళుతున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం జనవరి 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ని టాలీవుడ్‌లోనూ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి ‘చిక్కు బుక్కు’ అంటే సాగే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం తెలుగులో విడుదలవుతోంది.

Also Read- Anil Ravipudi: ఇండస్ట్రీలోకి రాకముందే అనిల్ ప్రేమకి సహాయం చేసిన నటులు


Also Read- Padma Bhushan Puraskar 2025: బాలయ్యతో పాటుగా పద్మ భూషణ్ పొందిన నటులెవరంటే..

Also Read- Mass Jathara Teaser: జాతర కాదు.. ర్యాంపేజ్.. ‘మనదే ఇదంతా’!

Also Read- Padma Bhushan Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్

Also Read- SSMB29 Memes: మహేశ్‌పై మీమ్స్‌.. ప్రియాంక ఫిక్స్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jan 26 , 2025 | 07:12 PM