Kora Teaser: ఈ టీజర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే..

ABN, Publish Date - Jan 03 , 2025 | 08:43 PM

యాక్షన్ జానర్, పీరియాడిక్ డ్రామాతో వస్తున్న చిత్రాలకు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనే కన్నడ నుంచి మరో యాక్షన్ మూవీ రాబోతోంది. ఒరాటశ్రీ దర్శకత్వంలో సునామీ కిట్టి హీరోగా ‘కోర’ అనే చిత్రం తెరకెక్కుతోంది.

తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ మూవీ టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తూ టీంకు అభినందనలు తెలిపారు. ఇక కోర టీజర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సరైన పాన్ ఇండియన్ మూవీలా కోర తెరకెక్కింది. టీజర్‌లో చూపించిన విజువల్స్, కెమెరా వర్క్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్‌ మాస్ ఆడియెన్స్‌కు ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.

Updated at - Jan 03 , 2025 | 08:45 PM