సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dil ruba Trailer: తప్పు చేసిన తర్వాత సారీ.. అవసరం తీరాక చెప్పే థాంక్స్‌..

ABN, Publish Date - Mar 06 , 2025 | 06:41 PM

‘క’ సక్సెస్ తర్వాత  కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaraam) నటించిన చిత్రం ‘దిల్‌ రూబా’ (Dil Ruba). విశ్వకరుణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయిక.  మార్చి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం  ట్రైలర్‌ను విడుదల చేసింది. నటీనటుల పాత్రలను పరిచయం చేస్తూ ఈ ట్రైలర్‌ ఉంది. ‘‘తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి.. అవసరం తీరిపోయిన తర్వాత చెప్పే థాంక్స్‌కి నా దృష్టిలో విలువ లేదు’’ అని కిరణ్‌ అబ్బవరం చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ప్రేమికుడి పాత్రలో కిరణ్‌ అబ్బవరం యాక్టింగ్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు అలరించేలా ఉన్నాయి.

Updated Date - Mar 06 , 2025 | 06:49 PM