Chhaava: ‘ఛావా’ నుండి అద్భుతమైన పాట 'జానే తు'

ABN, Publish Date - Jan 31 , 2025 | 04:36 PM

Chhaava: విక్కీ కౌషల్ ‘ఛావా’ మూవీ నుండి మేకర్స్ తాజాగా 'జానే తు' అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు ఎఆర్ రెహ్మాన్ సంగీతం, అర్జిత్ సింగ్ గానం హైలెట్‌గా నిలిచాయి. ఈ పాట ఒక థెరపీల ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఈ సాంగ్‌పై ఓ లుక్కేయండి.

విలక్షణ నటుడు విక్కీ కౌశల్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఛావా’. ‘మిమి’, ‘చుప్పి’ ఫేమ్‌ దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శంభాజీగా విక్కీ కౌషల్, భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది.


Also Read-Netflix under Pushpa’s Rule: పుష్ప గాడి రూల్‌లో నెట్‌ఫ్లిక్స్..

Also Read- Bad Girl: సమాజంలో కులం ఉంది కాబట్టే సినిమాల్లో కులం

Also Read-Thandel: బన్నీ.. మళ్ళీ ఆ పొరపాటు చేయకపోతే చాలు..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jan 31 , 2025 | 04:41 PM