Ghaati: అనుష్క ‘ఘాటి’ సినిమాలో దేశిరాజుగా ఎవరంటే.. గ్లింప్స్ విడుదల
ABN, Publish Date - Jan 15 , 2025 | 05:15 PM
క్వీన్ అనుష్క శెట్టి, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, UV క్రియేషన్స్ ప్రెజెంట్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఘాటి’ నుంచి దేశీ రాజుగా విక్రమ్ ప్రభును పరిచయం చేశారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు బర్త్ డే స్పెషల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’ గ్లింప్స్‌లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇది బ్లాక్ బస్టర్ ‘వేదం’ విజయం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్కకు నాల్గవ చిత్రం. ఈ చిత్రంలో తమిళ స్టార్ విక్రమ్ ప్రభు దేశీ రాజు అనే లీడ్ క్యారెక్టర్‌ని పోషిస్తున్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బుధవారం మేకర్స్ విక్రమ్ ప్రభు ఫస్ట్ లుక్, పాత్ర గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అతన్ని ఫెరోషియస్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. గ్లింప్స్ కూడా పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్ అనేలా ఉంది.