HATHYA Official Teaser: ఎక్కడో చూసినట్టు ఉందే అనిపించే 'టీజర్'

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:33 PM

HATHYA Official Teaser: తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో ఓ కీలకమైన ఘటనను ప్రతిబించేలా కనిపిస్తున్న ఓ సినిమా టీజర్ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

రవివర్మ, ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘హత్య’. ఈ సినిమాకి శ్రీవిద్య బసవ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‌. ప్రశాంత్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఓ హత్యా రహస్యం ఛేదనలో చోటుచేసుకునే పరిణామాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్‌ మర్డరీ మిస్టరీ థ్రిల్లర్స్‌కు భిన్నంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది.

Updated at - Jan 09 , 2025 | 01:26 PM