Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుండి బెస్ట్ సాంగ్ వచ్చేసింది..

ABN, Publish Date - Feb 11 , 2025 | 06:15 PM

రామ్‌ చరణ్‌ నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా అభిమానులను నిరాశపరిచిన.. అప్పన్న పాత్రలో రామ్‌ చరణ్‌ జీవించేశాడు. తాజాగా అప్పన్న పాత్ర నేపథ్యంలోనే సినిమాలో కనిపించే ‘కొండ దేవర’ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు అన్ని వర్గాల అభిమానులు పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘గేమ్ చేంజర్’. సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలో మేకర్స్ ఓటీటీలో విడుదల చేశారు. ఓటీటీలో ఈ సినిమా మంచి ఆదరణను రాబట్టుకుంటోంది.

Updated at - Feb 11 , 2025 | 06:19 PM