Phanindra Narsetti: మంచి పోయెట్రీలాంటి సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన కల్ట్ డైరెక్టర్
ABN, Publish Date - Jan 24 , 2025 | 12:52 PM
Phanindra Narsetti: ఫణింద్ర నరిశెట్టి ఈ డైరెక్టర్ పేరు 90స్ కిడ్స్ కి చాలా పరిచయమున్న పేరు. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ పీక్ లో ఉన్నప్పుడు కల్ట్ షార్ట్ ఫిల్మ్స్ తో అందరి ఫెవరెట్ గా నిలిచాడు. హీరోయిన్ చాందిని చౌదరి ఆయన తెరకెక్కించిన 'మధురం' షార్ట్ ఫిల్మ్ 90స్ కిడ్స్ కి ఓ మధురమైన జ్ఞాపకం. ఈ షార్ట్ ఫిల్మ్స్ తోనే ఆయనకు కల్ట్ ఫాలోయింగ్ లభించింది. అనంతరం ఆయన 2018లో 'మను' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ప్రయోగాత్మక చిత్రంలో బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ రాజా, చాందిని చౌదరి నటించారు. సినిమా తీవ్ర నిరాశ మిగిలిచింది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఓ కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు ఫణింద్ర కంబ్యాక్ ఇచ్చాడు.
'8 వసంతాలు' ఫణింద్ర నరిశెట్టి దర్శకత్వంలో మ్యాడ్(MAD) సినిమా ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanilkumar) ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న సినిమా. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఆకట్టుకునే డైలాగ్స్ తో ఈ సినిమా హార్డ్ పోయెట్రీల అనిపించింది. మీరు ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.