Thala Trailer: అమ్మ రాజశేఖర్ ‘తల’ మూవీ ట్రైలర్.. యాక్షన్ ప్యాక్డ్
ABN, Publish Date - Jan 28 , 2025 | 03:00 PM
‘రణం’ దర్శకుడు అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో, ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘తల’. దీప ఆర్ట్స్ పతాకంపై పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్నారు. రోహిత్, ఎస్తేర్ నొరొన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేశ్ తదితరులు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
టాలెంటెడ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘తల’. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. అమ్మ రాజశేఖర్‌కు కమ్ బ్యాక్ ఫిల్మ్‌గా నిలుస్తుందనేలా ఉందీ ట్రైలర్. దీప ఆర్ట్స్ పతాకంపై పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధ రాజశేఖర్ ఎగ్జిక్యూటీవ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కూడా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.