Dhanush's Golden Sparrow: తెలుగులో సెన్సేషనల్ ‘గోల్డెన్ స్పారో’ సాంగ్.. ఇప్పుడే వినండి
ABN, Publish Date - Jan 30 , 2025 | 06:39 PM
Dhanush's Golden Sparrow: గతేడాది హీరో ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా నుండి రిలీజైన ‘గోల్డెన్ స్పారో' సాంగ్ ఎంత సెన్సేషనల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటకు యూట్యూబ్ లో 14కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో వీపరీతంగా ట్రెండ్ అయ్యింది. తాజాగా పాట తెలుగు వెర్షన్‌ని రిలీజ్ చేశారు. మీరు ఓ లుక్కేయండి.
నటుడు ధనుష్ దర్శకత్వం వహించి నటిస్తున్న చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’. చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని తొలి సింగిల్ ‘గోల్డెన్ స్పారో’ గతేడాది ఆగష్టులో తమిళ్ లో రిలీజ్ అయ్యి సంచలన విజయం సొంతం చేసుకుంది. ఈ పాటను శుభలక్ష్మి, జీవీ ప్రకాశ్‌కుమార్, ధనుష్, అరివు కలిసి పాడారు. కాగా, అరివు లిరిక్స్ రాశారు.