Crime Beat: ‘క్రైమ్ బీట్’ జర్నీ ఆఫ్ ఎ జర్నలిస్ట్
ABN, Publish Date - Feb 11 , 2025 | 04:07 PM
‘ప్రతి సర్కస్‌కూ రింగ్ మాస్టర్ అవసరం. కానీ, రింగ్ మాస్టర్‌గా నేను చాలా వినోదాన్ని ఆస్వాదిస్తున్నా. విశ్రాంతిగా కూర్చొని మీరూ సర్కస్‌ను ఎంజాయ్ చేయండి సర్’, ‘జీవితంలో పైకి వెళ్లాంటే, ప్రతి విషయంలోనూ తలవంచుకుని ఉండటం మరింత ముఖ్యం’ వంటి అద్భుతమైన సంభాషణలతో జర్నలిస్ట్ జర్నీపై ఒక ఆసక్తికరమైన వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.
షకీబ్ సలీమ్, సబా ఆజాద్, రాహుల్ భట్, కీలక పాత్రల్లో సుధీర్ మిశ్రా, సంజీవ్ కౌల్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ‘క్రైమ్ బీట్’. తాజాగా రిలీజైన ఈ సిరీస్ ట్రైలర్ అందరి దృష్టిని వీపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 21 నుంచి జీ5లో (ZEE5)లో స్ట్రీమ్ కానుంది.