Artiste Movie Song: ‘ఆర్టిస్ట్’ మూవీలోని ‘చూస్తు చూస్తు’ వీడియో సాంగ్
ABN, Publish Date - Jan 31 , 2025 | 11:11 AM
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ హీరోహీరోయిన్లుగా ఎస్ జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్టిస్ట్’. రతన్ రిషి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది. తాజాగా ఈ మూవీలోని ‘చూస్తు చూస్తు..’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్టిస్ట్’. ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానున్న ఈ సినిమా నుంచి ‘చూస్తు చూస్తు..’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ‘చూస్తు చూస్తు..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి బ్యూటీఫుల్ ట్యూన్‌తో కంపోజ్ చేయగా.. రాంబాబు గోసాల క్యాచీ లిరిక్స్ అందించారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు. ‘చూస్తు చూస్తు చూస్తు నిన్నే చూస్తుండిపోయా, చూస్తు చూస్తు నేనే నీవై పోయా, చూస్తు చూస్తు నువ్వే చేశావే మాయ, చూస్తు గుండెల్లోనే దాచా చెలియా’ అంటూ హీరో హీరోయిన్ల మధ్య సాగే అందమైన పాటగా.. హోలీ పండుగ నేపథ్యంలో కలర్ ఫుల్‌గా పిక్చరైజ్ చేశారు.