Brahma Anandam: బ్రహ్మా'ఆనందమాయే'..
ABN, Publish Date - Jan 10 , 2025 | 08:11 AM
Brahma Anandam: కామెడీ కింగ్ బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. సినిమా కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. ఆ బజ్‌ని మరింత పెంచేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. తాజాగా ఈ మూవీ నుండి ‘ఆనందమాయే’ అనే అద్భుతమైన లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.
హాస్యనటుడు బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్‌గా నటించారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. గురువారం చిత్రబృందం ‘ఆనందమాయే’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది. శాండిల్య పీసపాటి సంగీత సారథ్యంలో మనీషా, యశ్వంత్‌నాగ్ ఆలపించారు. సాయికిరణ్ సాహిత్యం అందించారు.