Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బ్లాక్‌బస్టర్ పొంగల్ వీడియో సాంగ్
ABN, Publish Date - Jan 28 , 2025 | 08:03 PM
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్‌తో, హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రూ. 300 కోట్ల దిశగా దూసుకెళుతోంది. సినిమా విడుదలైన దాదాపు 15 రోజులు కావస్తున్నా.. మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ మూవీ నుండి ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ఈ సినిమా నుండి ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ అనే వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.