Bhairavam: 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్' బర్త్ డే స్పెషల్ అదిరింది..

ABN, Publish Date - Jan 03 , 2025 | 07:40 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మూవీ ‘భైరవం’ .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మూవీ ‘భైరవం’ (Bhairavam Movie). విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. శుక్రవారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్రబృందం తాజాగా ‘ఓ వెన్నెల’ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేసింది. శ్రీచరణ్‌ పాకాల అందించగా.. తిరుపతి జావన లిరిక్స్‌ రాశారు. అనురాగ్‌ కులకర్ణి, యామినిల గాత్రం హైలెట్ గా నిలిచింది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించారు.

Updated at - Jan 03 , 2025 | 07:42 PM